![]() |
![]() |

టాలీవుడ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. స్వయంగా చిరు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అలాగే, నేటి నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించాలని అనుకున్న 'ఆచార్య' చిత్రబృందం సైతం మరికొన్ని రోజులు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని... కోవిడ్-19 టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను" అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
గత 4, 5 రోజులుగా తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలిసిందిగా చిరంజీవి కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ప్రజలకు తెలియచేస్తానని చెప్పారు. శనివారమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చిరంజీవి కలిశారు. ఆయనతో పాటు నాగార్జున కూడా వెళ్లారు. దాంతో వాళ్ళిద్దరూ, వాళ్ళను కలిసిన వాళ్ళు టెస్టుల చేయించుకోవాల్సి వస్తుంది. హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.

![]() |
![]() |