![]() |
![]() |

ఇటీవల కాలంలో కథానాయిక, పాటలు లేకుండా ఘనవిజయం సాధించిన సినిమా.. `ఖైదీ`. కోలీవుడ్ స్టార్ కార్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 2019 దీపావళి కానుకగా విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్.. ఆపై `మాస్టర్` చిత్రంతో మరో మెమరబుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో `విక్రమ్` చేస్తున్నాడు లోకేశ్. ఈ వేసవిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, `విక్రమ్` తరువాత `మాస్టర్` స్టార్ విజయ్ తో మరో సినిమా చేయబోతున్నాడు లోకేశ్ కనకరాజ్. కోలీవుడ్ బజ్ ఏంటంటే.. కార్తి `ఖైదీ` తరహాలోనే విజయ్ కాంబినేషన్ లో లోకేశ్ చేయబోయే రెండో చిత్రం కూడా కథానాయిక, పాటలు లేకుండానే రూపొందనుందట. మరి.. రొమాన్స్, సాంగ్స్ తోనే సంచలనాలు సృష్టిస్తూ వస్తున్న విజయ్ లాంటి మాస్ హీరోతో లోకేశ్ చేయబోయే ఈ ప్రయోగం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
Also Read: కాస్టింగ్ కౌచ్.. మంచు లక్ష్మినీ వదల్లేదు!
కాగా, విజయ్ తాజా చిత్రం `బీస్ట్` వేసవిలో విడుదలకు సిద్ధమైంది. ఈ లోపే టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు విజయ్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరలో విజయ్, లోకేశ్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళుతుందంటున్నారు తమిళ తంబీలు.
![]() |
![]() |