![]() |
![]() |

రొటీన్‌కి భిన్నంగా సినిమాలను రూపొందించే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ప్రతిభ ఉన్న తనలాంటి వారు ఎంతో మంది ఉంటారని గ్రహించిన సుకుమార్. టాలెంట్ ఉన్నవారిని ఎప్పుడూ ప్రోత్సహించే అతను తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎంతో మంది విజయవంతమైన సినిమాలను రూపొందించారు. అయితే కొందరు తన దగ్గర పనిచేయకపోయినా తను అందించిన స్ఫూర్తితో దర్శకులుగా మారారు. అలాంటి వారి యశస్వి ఒకరు. తాజాగా దీపక్ సరోజ్ హీరోగా యశస్వి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సిద్ధార్థ్‌రాయ్’. వయొలెంట్‌గా సాగే ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏకలవ్య శిష్యుడిగా యశస్వి రూపొందించిన సినిమా టీజర్ చూసి ఎంతో ఇంప్రెస్ అయిన సుకుమార్ అతనికి ఓ గొప్ప ఆఫర్ ఇచ్చాడు. తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌లో చిన్న సినిమాలు నిర్మించే సుకుమార్ తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి యశస్విని దర్శకుడుగా ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ బేనర్లఓ ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన సుకుమార్ కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పాన్ ఇండియా మూవీస్ కూడా చేస్తున్నారు. అలాగే విభిన్నమైన చిన్న సినిమాలు కూడా చేయడానికి కొత్త దర్శకులకి అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ‘సిద్ధార్థ్‌రాయ్’ దర్శకుడు యశస్వికి తదుపరి సినిమా చేసే అవకాశం ఇస్తున్నాడు.
![]() |
![]() |