![]() |
![]() |
.webp)
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ "పెళ్లి సందడి" విడుదల అయ్యి రెండేళ్ళైపోయింది..ఐతే ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఇంకా బయటరాలేదు. మరి రోషన్ ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాడంటూ ఫాన్స్ అంతా అడుగుతుండేసరికి శ్రీకాంత్ ఆ విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "గ్యాప్ అంటే కాదు గాని పెళ్లి సందడి మూవీ టైములో వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్ ఒకదాన్ని ఓకే చేసాం అప్పట్లో పెద్ద బడ్జెట్ , పీరియాడికల్ మూవీ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఏ ప్రాజెక్ట్స్ వైపు వెళ్లకుండా ఈ ప్రాజెక్ట్ కోసమే స్టికాన్ అయ్యాము. మధ్యలో ఏ ప్రాజెక్ట్స్ ఐనా చేస్తే ఆ ఫిలింకి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఈ జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
ఫామిలీ టైపు మూవీస్ అంటే ఇష్టం లేదు రోషన్ కి. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టం. యాక్టింగ్ లో డిప్లొమా చేసాడు, బిబిఎం కోర్స్ ని విడిగా ప్రైవేట్ గా కట్టాడు. ఇక మా చిన్నబ్బాయి రోహన్ హిందీ మూవీలో ప్రభుదేవా కొడుకుగా నటించాడు. ఐతే ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ అయ్యి ఆ హిందీ మూవీ లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది. ఐతే ఆ సినిమా ఆగిపోయినందుకు చాలా బాధపడ్డాం..రిలీజ్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నాం...రోహన్ కి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఐతే ప్రస్తుతానికి 9 వ క్లాస్ చదువుతున్నాడు. కూతురు మేధా కెనడాలో మార్కెటింగ్ కోర్సు చేస్తోంది. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి నవ్వుకున్నాను." అంటూ శ్రీకాంత్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
![]() |
![]() |