![]() |
![]() |

ఇద్దరు మనుషులు గొడవ పడడం కామన్..కానీ రెండు పర్యాటక ప్రాంతాలు గొడవ పడితే ఎట్లుంటదో ఊహించుకోండి. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో మాల్దీవ్స్ వెర్సెస్ లక్షద్వీప్ అన్నట్టుగా ఉంది. ఐతే నటి నమిత మాత్రం ఈ విషయాన్ని ఇంకా హైలైట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. "మాల్దీవ్స్ ని చూస్తే సిగ్గు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. అన్నం పెట్టిన చేతిని కరవద్దు అంటూ ఇంగ్లీష్ లో సామెత కూడా ఉంది.
ప్రస్తుతం మాల్దీవులు చేసింది ఇదే "! మన గౌరవానికి లేదా మన డబ్బుకు వాళ్ళు అర్హులు కాదు !" అంటూ ఒక కామెంట్ ని పెట్టింది. అలాగే మాల్దీవ్స్ కి సంబంధించిన ఒక పిక్ ని కూడా పోస్ట్ చేసింది.."మాకు మాల్దీవ్స్ అంటే ఇష్టం లేదు...మా సొంత పర్యాటక ప్రాంతం లక్షద్వీప్ మాకుంది..మాల్దీవ్స్ ని బాయ్ కాట్ చేయండి...మన దేశంలో ఎవరికీ తెలియకుండా మట్టిలో మాణిక్యంలా ఉన్న లక్షద్వీప్ కి జై కొట్టండి" అంటూ ఆ పిక్ లో కనిపిస్తుంది. ఐతే కొంత మంది నెటిజన్స్ నమిత అభిప్రాయాన్ని సమర్ధించారు. ఒక నెటిజన్ మాత్రం " గత వారం మాల్దీవుల్లో తన హాలిడేను ఎంజాయ్ చేసిన అక్షయ్ కుమార్ మాల్దీవుల కంటే లక్షద్వీప్ బెటర్ అంటూ మద్దతు ఇవ్వడం చూశాను." అంటూ ఫన్నీ కామెంట్ చేసారు.
ఐతే ఈ మాల్దీవ్స్ గొడవ వెనక ఒక సంఘటన కూడా కారణమే అని చెప్పొచ్చు. మాల్దీవుల మహిళా మంత్రి షియునా ప్రధాని మోదీ ఒక తోలుబొమ్మ అంటూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దీనికి కారణం. ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ఫెమిలియర్ పెర్సొనాలిటీస్ అంతా మాల్దీవుల నేతల తీరును ఖండించారు. ఈ కామెంట్స్ చేసిన మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియం షివునా, ఎంపీ జహీద్ రమీజ్ వంటి నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం .
![]() |
![]() |