![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan) ప్రస్తుతం గేమ్ చేంజర్( game changer) షూటింగ్ లో బిజీబిజీ గా ఉన్నాడు. ఆ మూవీ కంప్లీట్ చేసాక బుచ్చి బాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నాడు. ఈ కాంబోలో తెరకెక్కబోయే మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే మూవీలో భారీ స్థాయిలో ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందని ఆ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని కూడా అంటున్నారు. అంతే కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా వుండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఆర్ సి 16 కి ఏ ఆర్ రెహమాన్ (a.r rehman) సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ వెంకట సతీష్ కిలారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మూవీలో ఇద్దరు కథానాయకలకి ఛాన్స్ ఉందని ఒక కథానాయికగా కియారా అద్వానీని (kiara advani) తీసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కియారా ప్రస్తుతం గేమ్ చేంజర్ లోను రామ్ చరణ్ తో జోడి కడుతుంది.
![]() |
![]() |