![]() |
![]() |
సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ వచ్చిందంటే దాన్ని వైరల్ చెయ్యడమే నెటిజన్లు పనిగా పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి.. డేటింగ్‌లు వంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా నెటిజన్లు శృతిహాసన్‌ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన రకరకాల రూమర్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. శృతి ప్రియుడు శంతను హజారికను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు హైలైట్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరి చేసిన కామెంట్లతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
ఓరి శ్రుతిహాసన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. శ్రుతి తనతో చాలా రూడ్‌గా బిహేవ్ చేసిందని, తను అనుకున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని ఓరి ఆరోపించాడు. అంతేకాదు.. ఆమె భర్తతో తను క్లోజ్‌గా ఉండడం వల్లే తనతో అలా ప్రవర్తించి ఉండొచ్చని ఓరి అనడంతో.. శ్రుతికి పెళ్ళయిపోయిందా.. అందుకే ఆమె లవర్ శంతనును భర్తగా సంభోదించాడా అని అందరూ అనుకుంటున్నారు. ఓరి ఇది కావాలని చేశాడా లేక యధాలాపంగా అన్నాడా అనే విషయం తెలియందు. అయితే అతను శ్రుతిని బ్యాడ్ చెయ్యాలన్న ఉద్దేశంతోనే అలా అన్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. దీనిపై శ్రుతిహాసన్ తాజాగా స్పందించింది. తాను పెళ్లి చేసుకున్నట్టు, తన భర్త శంతను అని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటానని అంటోంది. ఒకవేళ తనకు పెళ్లయితే చెప్పకుండా ఎలా వుంటానని ప్రశ్నిస్తోంది. తనకు పెళ్లయిందన్న వార్త వైరల్ అవ్వడం వల్ల ఈ క్లారిటీ ఇస్తున్నానంటోంది. ఈ రూమర్‌ను బయటికి తెచ్చిన ఓరి ఎవరో తనకు తెలియదని, తెలియని వారి మాటలను అస్సలు పట్టించుకోనని చెబుతోంది శ్రుతిహాసన్.
![]() |
![]() |