![]() |
![]() |

మూవీ : ఖో గయే హమ్ కహాన్
తారాగణం: అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్, రోహన్ గుర్బక్సాని, కల్కి కోల్చెయిన్
దర్శకత్వం: అర్జున్ వరైన్ సింగ్
సంగీతం: అంకుర్ తివారీ, సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ: తనయ్ సతం
ఎడిటర్: నితిన్ బెయిద్
నిర్మాతలు: జోయా అక్తర్, రీమా కగ్టి, రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్
అనన్య పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ' ఖో గయే హమ్ కహాన్ ' మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో ఉంది. మరి ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ :-
ముంబైలోని ఒక ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు అహానా, నీల్, ఇమాద్ కలిసి ఉంటారు. వారంతా చిన్నతనం నుండి స్నేహితులుగా ఉండటం వల్ల వారి లైఫ్ సాఫీగా సాగుతుంటుంది. అయితే అహానా తన చదవు పూర్తిచేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇమాద్ ఒక స్టాండప్ కామెడీ షోలో పనిచేస్తుంటాడు. నీల్ జిమ్ లో ట్రైనర్ కింద ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తుంటాడు. కాగా వాళ్ళంతా తము చేసే పనిలో సక్సెస్ అయి గొప్ప స్థాయికి చేరాలనుకుంటారు. ఇక ముగ్గురు సోషల్ మీడియాకి ప్రభావితం అవుతారు. మరి ఆ తర్వాత వారి లైఫ్ ఎలా సాగింది? అందరు తము అనుకున్న వాటిని సాధించగలిగారా? లేదా అనేది మిగతా కథ..
విశ్లేషణ:-
ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఫోన్ కి అడిక్ట్ అయ్యారు. అందులోను యువత మరీ అత్యధికంగా వాడుతుంటారు. డేటింగ్ ఆప్స్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, టిండర్ అంటు ఎన్నో ఆప్స్ ని వాడుతు తమ లైఫ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో ముగ్గురు స్నేహితుల మధ్య ఏం జరిగింది? అసలెందుకు వాళ్ళు ముగ్గురు విడిపోయారు అనేది చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ అర్జున్ వరైన్ సింగ్.
ఈ మూవీ కథ చాలా సింపుల్.. డేటింగ్ ఆప్ లో మునిగిపోయి తమకున్న వాటిని కాదనుకొని ముందుకెళ్ళాలనుకున్న ముగ్గురు స్నేహితుల జీవనశైలీ. కథ బాగున్నప్పటీకి స్క్రీన్ ప్లే మరీ నెమ్మదిగా సాగుతుంది. ఈ కథని ప్రెజెంట్ చేయడానికి ఇంత నిడివి అవసరం లేదనిపిస్తుంది. కథనం మొదటి భాగంలో క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి డైరెక్టర్ వారి గురించి విఫులంగా చూపించాలనుకోవడంతో అక్కడ నెమ్మదిగా సాగుతుంది. ఇక అదే రిపీట్ అవుతుంది. ఈ రోజుల్లో యువతీ, యువకులు పరిధులు దాటి ఉండటం సహజమే అన్నట్టుగా చూపించారు డైరెక్టర్.. కానీ ఏదీ మితిమీరి ఉండకూడదు కదా. యువత అనగానే బోల్డ్ కంటెంట్ ఇవ్వాలని విచ్చలవిడి రొమాన్స్ ని బలవంతంగా జొప్పించారనిపిస్తుంది. అయితే కథనం బాగుంటుంది. కానీ దానికి ఇంత నిడివి ఎందుకా అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో కథలో వేగం పెరుగుతుంది కానీ అప్పటికే ప్రేక్షకులకి ఓపిక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్టావ్ లో నెమ్మదిగా సాగే సీన్లు అప్పటికే బోలెడు వస్తుంటాయి. అయితే క్లైమాక్స్ ని మాత్రం పక్కాగా హ్యాపీ ఎండింగ్ తో ప్లాన్ చేసి వదిలారు మేకర్స్. అరేయ్ ఇంత మంచి సినిమాని చూడలేదా అని అనుకునేలా చివరి ఇరవై నిమిషాలని వేగంగా చూపించేశారు మేకర్స్.
మ్యూజిక్ ప్రతీ ఒక్కరరికి కనెక్ట్ అయ్యేలా స్మూత్ గా అందించారు. ప్రతీ పాట ఆ సిచువేషన్ కి తగ్గట్టుగా ఇచ్చారు.తనయ్ సతం అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:-
అహానాగా అనన్య పాండే చక్కగా నటించింది. సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్, రోహన్ గుర్బక్సాని తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:-
సోషల్ మీడియాకి ప్రభావితులవుతున్న వారి జీవితాలు ఎలా మారుతున్నాయేనా థీమ్ తో బాగా తీసారు. నిడివి, సాగదీత సీన్లు పక్కనపెడితే ఈ మూవీని ఒకసారి చూసేయొచ్చు
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |