Home  »  News  »  ఫ్యూచర్ లో ఇండియా ఎలా ఉండబోతుందో ప్రభాస్ కల్కి 2898 ad లో చూపించబోతున్నాం...

Updated : Dec 29, 2023

సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూసారో ఇప్పుడు ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి కోసం అంతకు  మించి ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. కల్కి కేవలం ఒక సినిమానే కాదు భారతీయ సినిమాని ప్రపంచ సినిమా ముందు గర్వంగా నిలబడిపోయేలా చేసే సినిమాగా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ తాజాగా మహారాష్ట్రలోని  బాంబే ఐఐటీ లో జరిగిన టెక్ ఫెస్ట్ 23 లో  పాల్గొన్నాడు. ఈ సందర్భంగా  కల్కి 2898 AD ప్రత్యేక కంటెంట్ ను ప్రదర్శించారు. ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడుతు కల్కి ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే ఒక  డిఫరెంట్ ఫిల్మ్. హాలీవుడ్ మేకర్స్ నిర్మించే ఫ్యూచర్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూపించినట్టే  కల్కి లో కూడా ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతున్నాయో చూపించబోతున్నాం. దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తు ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి కల్కి కోసం ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశామని చెప్పాడు. 

పైగా కల్కి టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమాలో కనపడిన ఆయుధాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు.ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని  కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలిసి  మేధోమధనం చేసి మరి  ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం కూడా తమకి  వుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.అలాగే  ప్రభాస్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె క్యారెక్టర్స్  వాళ్ల అభిమానులంతా  ఆనందపడే రీతిలో ఉంటాయని ఇంతకు ముందెప్పుడు అలాంటి  పాత్రల్లో వారు కనిపించలేదని కూడా ఆయన చెప్పాడు. అలాగే కొంత మంది కల్కికి 2898 AD అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి అని అడిగితే  దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో అందుకు కారణాన్నిచెప్తానని అలాగే 93రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెప్పాడు. 
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.