![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `సలార్`. యాక్షన్ సాగాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. `సలార్`లో కథానుసారం ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఆ పాటలో `కేజీఎఫ్` భామ శ్రీనిధి శెట్టి ఆడిపాడనుందని సమాచారం. క్లైమాక్స్ లో వచ్చే ఈ సాంగ్.. సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని టాక్. త్వరలోనే `సలార్`లో శ్రీనిధి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, ఇప్పటికే `కేజీఎఫ్` నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్ నే `సలార్`ని కూడా నిర్మిస్తుండడం.. `కేజీఎఫ్`కి పనిచేసిన ఛాయాగ్రహకుడు భువన్ గౌడ్, సంగీత దర్శకుడు రవి బస్ రూర్ `సలార్`కి కూడా కంటిన్యూ అవుతుండడంతో.. ప్రశాంత్ నీల్ సెంటిమెంట్ పరంగా శ్రీనిధిని కూడా ఇలా కొనసాగిస్తున్నారని వినిపిస్తోంది. మరి.. ప్రశాంత్ సెంటిమెంట్ `సలార్`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, `సలార్` 2022 ఏప్రిల్ 14న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |