![]() |
![]() |

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఓ హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తెనాలిలో పుట్టి, విశాఖపట్నంలో పెరిగి, ముంబైలో కెరీర్‌ను స్టార్ట్ చేసిన శోభిత 'గూఢచారి' సినిమాలో అడివి శేష్ సరసన నటించడం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి చిత్రంతోనే మాతృభాషా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన హిందీ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' సూపర్ హిట్ అవడంతో, బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్ దేవ్ పటేల్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న 'మంకీ మ్యాన్' మూవీలో ఓ కీలక పాత్రకు ఎంపికైంది శోభిత. ఆస్కార్ అవార్డులు సాధించడంతో పాటు కమర్షియల్‌గానూ పెద్ద హిట్టయిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్'లో మెయిన్ లీడ్‌గా చేయడం ద్వారా దేవ్ పటేల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.
చెప్పుకోదగ్గ విశేషమేమంటే 'మంకీ మ్యాన్' కోసం ఐదేళ్ల క్రితమే ఆడిషన్‌లో పాల్గొంది శోభిత. అందుకని ఆ సినిమా గురించి మర్చిపోయింది. "దాదాపు ఐదేళ్ల క్రితం ఆడిషన్ జరిగింది. కొద్ది రోజుల తర్వాత దేవ్ పటేల్‌తో కలిసి స్క్రీన్ టెస్ట్ కోసం మళ్లీ రమ్మన్నారు. ఆ రోజు నాకింకా బాగా గుర్తుంది.. అప్పుడు నేను నా ఫస్ట్ ఫిల్మ్ 'రామన్ రాఘవ్ 2.0' బృందంతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం వెళ్తున్నాను. అని తెలిపింది శోభిత. తన క్యారెక్టర్‌లో రకరకాల షేడ్స్ ఉంటాయనీ, ఆ క్యారెక్టర్ బాధలు పడుతూనే గ్లామరస్‌గానూ కనిపిస్తుందని చెప్పింది. 'మంకీ మ్యాన్' వరల్డ్‌వైడ్ హక్కుల్ని 30 మిలియన్ డాలర్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
శోభిత ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో మరోసారి స్క్రీన్ పంచుకుంటూ 'మేజర్' సినిమా చేస్తోంది. మహేశ్‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా జూలై 2న విడుదల కానున్నది.

![]() |
![]() |