![]() |
![]() |

శృతి హాసన్... సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్.. ప్రీవియస్ చిత్రం పెద్ది లో రామ్ చరణ్ కి ధీటుగా 'హల్లల్లా' సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసి స్పెషల్ సాంగ్స్ లో కూడా నా రేంజ్ వేరు అని మరోసారి నిరూపించింది. సుదీర్ఘ కాలం పాటు ముంబై, చెన్నై నగరాల మధ్య ప్రయాణాలు చేస్తూ బిజీగా గడిపిన శృతి ఎట్టకేలకు తన సొంతూరు చెన్నైలో ఒక సరికొత్త లగ్జరీ నివాసాన్ని కొనుగోలు చేశారు.
ఈ మేరకు నిన్న సోమవారం నాడు నూతన గృహంలో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి, గృహప్రవేశం చేశారు. ఈ వేడుకలో శ్రుతి ఎంతో సరళమైన, సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు. చాలా తక్కువ జ్యువెలరీతో, ఎంతో హుందాగా కనిపించింది. పూజలో భాగంగా నేలపై కూర్చుని దైవ ప్రార్థనలు చేస్తున్న చిత్రాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పూజకి సిద్ధం చేసిన రకరకాల సాంప్రదాయ స్వీట్లు, కొత్త ఇంటి తాళాల గుత్తి వంటి ఆసక్తికరమైన గ్లింప్సెస్ ఈ ఫోటోల్లో కనిపించాయి. తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని, ఈ వేడుక కేవలం అత్యంత ఆప్తులు, స్నేహితుల సమక్షంలో జరిగినట్లు ఇన్స్టాగ్రామ్ పారాపరాజీ పేజీల ద్వారా తెలుస్తోంది. ఈ వేడుకకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన క్షణాలను శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also read: Rao bahadur: రావు బహదూర్ కలెక్షన్స్ ఇవే.. అయ్యగారు దెబ్బకొట్టరా!
అయితే, ఈ ఆనందకరమైన సందర్భంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రుతి హాసన్ గృహప్రవేశ పూజలో ఆమె తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్, తల్లి సారిక, చెల్లెలు అక్షర హాసన్ ఎవరూ కనిపించలేదు. ఈ వేడుక కేవలం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ప్రైవేట్ అఫైర్‌గా జరగడం వల్ల, కుటుంబ సభ్యులు దీనికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శ్రుతి కానీ, కమల్ హాసన్ కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శృతి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతితో చేస్తున్న 'ట్రైన్', 'ఆకాశంలో ఒక తార' 'కాల్ మీ బే సీజన్ 2' వెబ్ సిరీస్ ఉన్నాయి.
![]() |
![]() |