Home  »  News  »  ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే.!

Updated : Jul 14, 2026

సినిమా ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. జూలై మూడవ వారంలో ఓటీటీ వేదికలు వినోదంతో కళకళలాడబోతున్నాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్న తరుణంలో, ఇంట్లోనే కూర్చుని సరికొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి ఓటీటీ దిగ్గజాలు దాదాపు 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరించనున్నాయి. ముఖ్యంగా ఈ వారం స్ట్రీమింగ్ కానున్న వాటిలో కొన్ని ఆసక్తికరమైన కంటెంట్ ఉండటంతో సినీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ తనదైన శైలిలో అంతర్జాతీయ కంటెంట్‌ను అందిస్తోంది. జూలై 15న ఇంగ్లిష్ వెబ్ సిరీస్ 'ద హాక్', జూలై 16న ఇండోనేసియన్ సినిమా 'మీ బిఫోర్ మీ', జూలై 17న 'ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్' (స్పానిష్ వెబ్ సిరీస్) వంటివి ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటితో పాటు జూలై 17న 'ద ఈస్ట్ ప్యాలెస్' (కొరియన్ వెబ్ సిరీస్), 'డిజైర్' (ఇంగ్లిష్ సినిమా), '23000 లైవ్స్' (జర్మన్ సినిమా), 'హార్ట్ స్టాపప్ ఫరెవర్' (ఇంగ్లిష్ సినిమా) వంటి విభిన్న జోనర్ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. చివరగా, జూలై 18న 'స్పూకీ ఇన్ లవ్' అనే కొరియన్ వెబ్ సిరీస్‌తో వీకెండ్ ముగియనుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 13న 'మర్డర్ 101' (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ), జూలై 14న 'బ్యాక్ రూమ్స్' (ఇంగ్లిష్ సినిమా), జూలై 15న 'రైడ్ ఆర్ డై' (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ కానున్నాయి. 

ఇక జియో హాట్‌స్టార్‌లో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం. జూలై 17న సమంత రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మా ఇంటి బంగారం' సినిమా అందుబాటులోకి రానుంది. అలాగే జూలై 13న 'సెకండ్ లవ్' (తమిళ రియాలిటీ వెబ్ సిరీస్), 'పవిత్రం' (మలయాళ సిరీస్), 'వుథరింగ్ హైట్స్' (ఇంగ్లీష్ మూవీ) రానుండగా, జూలై 16న 'రెడీ ఆర్ నాట్ 2' (తెలుగు డబ్బింగ్ సినిమా), జూలై 18న 'టెస్ట్ సబ్జెక్ట్ వీ' (హిందీ డాక్యుమెంటరీ) కూడా జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

జూలై 17న జీ5 ఓటీటీలో వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' స్ట్రీమింగ్ కానుంది.  ఆపిల్ టీవీ ప్లస్‌లో జూలై 15న 'లక్కీ' (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) విడుదలవుతుండగా, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో జూలై 16న 'రక్తాంచల్ సీజన్ 3' (హిందీ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ కానుంది. మొత్తం మీద ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందనుంది. 

 

 

OTT Releases Telugu, Netflix, Jio Hotstar, Amazon Prime, OTT Telugu

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.