![]() |
![]() |

జానీ మాస్టర్ తన ప్రీవియస్ చిత్రం 'పెద్ది'(Peddi)అన్ని సాంగ్స్ కి అదిరిపోయే డాన్స్ కంపోజ్ చేసి మరోసారి అభిమానులని, ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మరో డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలపై జానీ మాస్టర్ స్పందిస్తూ మా యూనియన్ లో ఎలాంటి గొడవలు లేవు. నేను శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవి గారి ఇంట్లో చిరంజీవి గారితో కలిసి భోజనం చేసాం. మాకు చిరంజీవి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. యూనియన్ లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమే. శేఖర్ మాస్టర్ కి నాకు మధ్య ఎలాంటి ఇష్యు లేదు. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ బేధాలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చాడు.
ViJay: హీరోగా మారుతున్న విజయ్ కొడుకు.. విజయ్ ప్లేస్ ని భర్తీ చేస్తాడా!
![]() |
![]() |