![]() |
![]() |

అలనాటి శృంగార తార షకీలా నిజజీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'షకీలా'. ఇంద్రజీత్ లంకేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో టైటిల్ రోల్‌ను రిచా చాఢా పోషించారు. పంకజ్ త్రిపాఠి, ఎస్తర్ నోరన్హా, రాజీవ్ పిళ్లై, శివ రాణా, కాజోల్ చుగ్, సందీప్ ములాని కీలక పాత్రధారులు. ఇప్పటికే హిందీ వెర్షన్ డిసెంబర్ 25న విడుదలవగా, తెలుగు వెర్షన్ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మీడియాతో షకీలా మాట్లాడుతూ, "జనవరి 1న సినిమా విడుదలవుతోంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే షకీలా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా బయోపిక్ అయిన 'షకీలా' సినిమాకి ఎలా సెన్సార్ తీసుకుని ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎంటైర్ నా లైఫ్ గురించి అనే కాదు, కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సినిమా చాలా బాగా వచ్చింది. 'షకీలా' సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ మోటివ్‌లోనే చూడండి. అది చాలు" అన్నారు.
షకీలా బాడీ డబుల్ క్యారెక్టర్ చేసిన ఎస్తర్ మాట్లాడుతూ, "చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలో భాగం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. షకీలా గారి లైఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను" అన్నారు.
సందీప్ మలాని మాట్లాడుతూ, "నాకు ఏడు సంవత్సరాల వయసున్నప్పటి నుండి నేను శ్రీదేవి గారికి వీరాభిమానిని. తెలుగులో చాలా సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు 'షకీలా' సినిమా ద్వారా మిమ్మల్నందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ చిత్రం కర్ణాటకలోని తీర్థహల్లి, అలాగే బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది." అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వీర్ మాట్లాడుతూ, "మాది బీదర్. నేను సినిమాలు చూడడానికి హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా వస్తుంటాను. ఇప్పుడు నా సినిమా ప్రమోషన్‌కోసం ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటల్ని కంపోజ్ చేశాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను." అన్నారు.
![]() |
![]() |