![]() |
![]() |

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ నుంచి వస్తోన్న 14వ చిత్రం 'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). ఇప్పటివరకూ టైటిల్‌లోని నాలుగు ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడివిడిగా విడుదల చేయగా, వాటికి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. జగపతిబాబు (ఫాదర్), బేబి సహశ్రిత (చిట్టి), అమ్ము అభిరామి (ఉమా), కార్తీక్ (రామ్ కార్తీక్) ఫస్ట్ లుక్ పోస్టర్లు, వాటి విలక్షణ ట్యాగ్‌లైన్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
లేటెస్ట్‌గా చిత్ర బృందం నాలుగు ప్రధాన పాత్రధారుల కంప్లీట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ కంప్లీట్ లుక్ సైతం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మరోసారి విలక్షణమైన టైటిల్‌తోనే కాకుండా, వినోదాత్మక రొమాంటిక్ మూవీతో వస్తున్నారని ఫస్ట్ లుక్ ప్రకారం అర్థమవుతోంది.
నలుగురు యాక్టర్ల ముఖాల్లో తాండవిస్తోన్న ఆనందాన్ని చూస్తుంటే, డైరెక్టర్ విద్యాసాగర్ రాజు వారి నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ విలక్షణ, ఉత్తేజభరిత చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మునుముందు శ్రీ రంజిత్ మూవీస్ అందించే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురుచూడాల్సిందే.

![]() |
![]() |