![]() |
![]() |

మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేసిన 'సర్కారు వారి పేట' మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదలవుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది. మహేశ్ స్టైలిష్ లుక్, అతను చెప్పిన ఒన్ లైనర్ డైలాగ్స్, అతను చేసిన ఫైట్స్.. అన్నీ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగలా అనిపించాయి. ఇప్పటివరకూ ఈ ట్రైలర్‌కు 33 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి.
ఇప్పటికే ఓవర్సీస్‌లో, అమెరికా వ్యాప్తంగా 'సర్కారు వారి పాట' అడ్వాన్స్ సేల్ ప్రారంభమైంది. 261 ప్రదేశాల్లో 707 షోలతో ఈ మూవీ అక్కడ విడుదలవుతోంది. అందిన సమాచారం మేరకు, బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే 11696 టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ 244.5 వేల డాలర్లు. ఈ వేగం చూస్తుంటే ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనేది నిజం. కీర్తితో మహేశ్ కెమిస్ట్రీ సూపర్బ్ అనిపిస్తోంది. ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు మంచి వినోదాన్ని ఇస్తాయని అర్థమైపోతోంది. మహేశ్ డైలాగ్స్‌ను వెన్నెల కిశోర్ ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని వినడం అలరిస్తోంది. పరశురామ్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాకు మంచి ఎస్సెట్స్‌గా నిలుస్తాయని యూనిట్ అంటోంది.
ఇప్పటికే విడుదలైన పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో అమిరాయనీ, ప్రేక్షకులకు ఈ మూవీ మంచి విందు భోజనంలా ఉంటుందనీ వినిపిస్తోంది.
![]() |
![]() |