![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
"రెండేళ్ల తర్వాత అభిమానులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా పరశురామ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఎక్సట్రార్డినరీగా డిజైన్ చేశారు. నా డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్, మేనరిజమ్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సినిమాలో హీరో-హీరోయిన్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఈ ట్రాక్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్ గానీ, పర్ఫామెన్స్ గానీ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది." అని అన్నాడు.
"థమన్ గురించి చెప్పాలి. మాకు ఎందుకు వచ్చిందో గానీ చాలా గ్యాప్ వచ్చింది. ప్రజెంట్ తను మ్యూజిక్ సెన్సేషన్. అన్ని వర్గాల ఆడియన్స్ కి థమన్ మ్యూజిక్ కనెక్ట్ అవుతుంది. కళావతి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. నేను థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఫ్యాన్ ని. మన సినిమాకి ఇరగదీశాడు. డీఓపీ మది గారు శ్రీమంతుడుకి మించిన అవుట్ పుట్ ఇచ్చారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్, శేఖర్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ బెస్ట్ ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ గారు ఈ సినిమాని చూసినప్పుడల్లా పోకిరిని దాటుతుంది అన్నారు" అని చెప్పాడు.
"ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గర ఉన్నోళ్లు దూరమయ్యారు. కానీ ఏది జరిగినా, ఏం మారినా.. మీ అభిమానం మాత్రం మారలేదు. అలాగే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోడానికి. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు.
![]() |
![]() |