![]() |
![]() |

బాలీవుడ్‌లో బయోపిక్‌లు వరుసపెట్టి రూపొందుతున్న విషయం తెలిసిందే. పేరుపొందిన క్రీడాకారులు, జాతీయ నాయకులు, చారిత్రక వ్యక్తులు, సినీ సెలబ్రిటీల జీవిత కథలు తెరకెక్కుతున్నాయి. సంజయ్ దత్ బయోపిక్ సంజు తర్వాత మరో సినీ సెలబ్రిటీపై సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అది ఒకప్పటి టాప్ స్టార్ ధర్మేంద్ర బయోపిక్.
ఎందుకంటే, ఓ ఇంటర్వ్యూలో "ఏ నటుడి జీవిత చరిత్రలో మీకు నటించాలని ఉంటుంది?" అని సల్మాన్ ఖాన్‌ని అడిగితే .. "ధరమ్‌జీ (సీనియర్ నటుడు ధర్మేంద్ర) జీవిత చరిత్రలో నటించాలని ఉంది’’ అని ఆయన చెప్పాడు. ధర్మేంద్ర కూడా తన జీవిత చరిత్రతో సినిమా వస్తే, అందులో సల్మాన్ ఖానే నటించాలని అన్నారు. సల్మాన్ అభిప్రాయాలూ, తనవీ దాదాపు కలుస్తాయనీ, అందుకే ఆయన నటిస్తే యాప్ట్‌గా ఉంటుందనుకుంటున్నాననీ ధర్మేంద్ర చెప్పారు.
సో.. తన బయోపిక్ రావడం ధర్మేంద్రకు అభ్యంతరం లేదు. అలాగే అందులో నటించడానికి సల్మాన్ సుముఖంగా ఉన్నాడు. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించడానికి ఎవరు ప్రయత్నిస్తారో చూడాలి.
![]() |
![]() |