![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా కాంపౌండ్ కి చెందిన అగ్ర కథానాయకులు. అలాంటి ఈ ఇద్దరు ఒకే దర్శకుడితో చేయబోతున్న వేర్వేరు సినిమాల్లో.. ఒకే తరహా పాత్రల్లో కనిపించబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఐదు వరుస విజయాల తరువాత.. మెగా కాంపౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నారు. అందులో ఒకటి ఆచార్య కాగా.. మరొకటి అల్లు అర్జున్ కాంబో మూవీ.
ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక పాత్రలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇదో స్టూడెంట్ లీడర్ రోల్ అని తెలిసింది. ఇక బన్నీతో శివ చేయబోయే సినిమాలో కథానాయకుడి పాత్ర రెండు కోణాల్లో ఉంటుందని.. అందులో ఒకటి స్టూడెంట్ లీడర్ డైమన్షన్ కాగా.. మరొకటి పొలిటికల్ లీడర్ డైమన్షన్ అని బజ్.
సో.. చెర్రీ, బన్నీ.. ఇద్దరు కూడా కొరటాల శివ సినిమాల్లో సేమ్ టు సేమ్ రోల్స్ లో కనిపించబోతున్నారన్నమాట. మరి.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |