![]() |
![]() |

బిగ్ బాస్ 4లో సినీ రంగానికి చెందిన హీరో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. హీరో అభిజీత్ అయితే, హీరోయిన్ మోనాల్. షో మొదలైన కొత్తలో మోనాల్‌ను ఆకర్షించడానికి అభిజీత్‌తో పాటు అఖిల్ కూడా ప్రయత్నించినట్లు కనిపించింది. ఆమె కూడా వారితో కాస్త సన్నిహితంగా ఉంటూ వచ్చింది. దాంతో ఈ ముగ్గురి మధ్య లవ్ ట్రయాంగిల్ నడుస్తున్నట్లే కనిపించింది. కానీ తర్వాత ఈ ముగ్గురి మధ్య గొడవలు మొదలై, అవి పెద్దవయ్యాయి. గేమ్స్‌లో భాగంగా పరస్పరం మోసం చేసుకుంటూ వచ్చారు.
వీక్షకుల్లో మోనాల్‌పై పెద్ద ఆదరణ కనిపించ లేదు. అనేకసార్లు నామినేట్ అయినా హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ కలిసి ఆమెను సేవ్ చేసుకుంటూ వచ్చారనే అభిప్రాయం వీక్షకుల్లో వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఆమె గురించిన కామెంట్స్ చూస్తే.. అసలామె ఇక్కడి దాకా ఎలా వచ్చిందనే అనుమానాలు కలగకమానవు. గ్లామర్ కోసమే షోలో ఆమె ఉండేలా కాపాడుకుంటూ వచ్చారనే ఆరోపణలున్నాయి. అయితే ఇంకో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్న సమయంలో ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యిందంటూ ప్రచారంలోకి వచ్చింది.
ఈ వారం అభిజీత్, అఖిల్, మోనాల్, అవినాష్ నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిందరిలో అభిజీత్‌కు ఎక్కువ ఓట్లు ఉన్నాయి. మోనాల్, అవినాష్‌కు ఓట్ల శాతం బాగా తక్కువగా ఉంది. దానికి తోటు పాలు పితికే టాస్క్‌లో తనను మోనాల్ తన్నిందని అవినాష్ కంప్లయింట్ చేయడం ఆమెకు మైనస్ అయ్యింది. దాంతో ఆమెకు ఓట్లు మరింత తగ్గాయి. అందువల్లే మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. చూద్దాం.. హోస్ట్ నాగార్జున హౌస్ నుంచి ఎవరిని బయటకు పంపిస్తారో...
![]() |
![]() |