![]() |
![]() |

బిగ్ బాస్ 4 తెలుగు చివరి వారానికి చేరువవుతోంది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉండగా, బరిలో ఏడుగురు కంటెస్టెంట్లు నిలిచారు. ఫైనల్ టాస్క్‌కు టిక్కెట్‌ను గెలుచుకోవడం ద్వారా ఈ షో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అఖిల్ సార్థక్. ఈ వారంలో ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఉంటుందని, అది అందరికీ షాక్ ఇస్తుందనీ వినిపిస్తోంది.
ఫైనల్ రేస్ సందర్భంగా హౌస్‌మేట్స్ ఒకరినొకరు కౌగలించుకొని డాన్స్ చేశారు. ఏదేమైనా అభిజీత్ తనంతట తాను వరస్ట్ పర్ఫార్మర్‌గా అట్టడుగు స్థానంలో నిలవడంతో ర్యాంకింగ్ టాస్క్ ఇబ్బందికరమైన స్థితిలోకి అడుగుపెట్టిందని చెప్పాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో మోనాల్‌తో డేట్‌కు తిరస్కరించిన అభి, తన పొరపాటుకు తగ్గ స్థానంలో నిల్చున్నాడు.
వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడం ద్వారా, వారి ఆదరణను పెంచుకోవడానికి నిర్వాహకులు వేసిన మరో ఎత్తుగడగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అభిజిత్ రైట్ ట్రాక్‌లోనే ముందుకు వెళ్తున్నాడని అతని ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు. సొహేల్ బెస్ట్ పర్ఫార్మర్‌గా నిలవగా, అవినాష్ ఐదు స్థానంలో నిలిచాడు.
వరస్ట్ పర్ఫార్మెన్స్ కారణంగా అభిజీత్ జైలులోకి వెళ్లాడు. జైలు నుంచి బయటకు రాగానే జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అభిజీత్ గాయాల పాలయ్యాడు. ట్రీట్‌మెంట్ నిమిత్తం అతను హౌస్‌ను వదిలి బయటకు వస్తాడా, లేక హౌస్‌లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఏదేమైనా అభిజిత్ ఫ్యాన్స్‌కు ఈ వారం ఆందోళనకర పరిణామాలు సంభవించాయి.
ఎలిమినేషన్ విషయానికి వస్తే, 13వ వారం వోటింగ్ ఫలితాలను అనుసరించి హారిక, మోనాల్‌లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వోటింగ్ పోల్స్‌లో అవినాష్ సైతం కింది స్థానాల్లో ఉన్నప్పటికీ, ఈ వారం ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం హారిక ఎలిమినేట్ అయితే, వచ్చే వారం అవినాష్ ఎలిమినేట్ కావచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.
.jpg)
![]() |
![]() |