![]() |
![]() |

డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడనున్న నిహారిక కొణిదెల శనివారమే పెళ్లికూతురుగా ముస్తాబయింది. అవును. శనివారం నాగబాబు ఇంట్లో నిహారిక పెళ్లికూతురు వేడుక జరిగింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి పనులన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్న నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ వేడుకకు సంబంధించిన ఓ పిక్చర్‌ను షేర్ చేశాడు. ఈ పిక్చర్‌లో నవ్వులు చిందిస్తోన్న నిహారిక గోల్డ్-పర్పుల్ బోర్డర్ ఉన్న గ్రీన్ శారీ, ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ బ్లౌజ్‌లో మెరిసిపోతోంది. వడ్డాణం, ముక్కుపుడక, నెక్లెస్, చెవిరింగులు, పాపిట బిళ్ల లాంటి సంప్రదాయ అలంకరణలు సరేసరి. తక్కువ మేకప్ వేసుకున్న నిహారికను చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తోంది. పసుపు-కుంకుమ, మంగళ స్నానం కార్యక్రమాలకు నిహారిక ఎరుపు రంగు చీరను ఎంచుకుంది.
పెళ్లికూతురు వేడుకకు ముస్తాబు చేసిన ఇంట్లోని టేబుల్స్‌పై "నిహారిక పెళ్లికూతురు" అని తెలుగులో ప్రింట్ చేసిన టాపర్స్‌ని చూడొచ్చు. పెళ్లి మండపంలో వేసిన ప్రత్యేకమైన కుర్చీలో నిహారిక కూర్చోగా, అతిథులు ఆమె చుట్టూ వేసిన రౌండ్ టేబుల్స్ దగ్గర కూర్చున్నారు. మరోవైపు చైతన్య పెళ్లికొడుకు వేడుక కూడా జరిగింది. నిహారిక పెళ్లికూతురు వేడుక ఎలిఫెంట్ థీమ్‌తో జరగగా, చైతన్య పెళ్లికొడుకు వేడుక ఆక్స్ థీమ్‌తో జరిగింది. డిసెంబర్ 9న రాజస్తాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నాడు.


![]() |
![]() |