![]() |
![]() |

సలార్..సలార్.... సలార్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామ జపం..పైగా ఏ నలుగురు కలిసినా కూడా సలార్ టికెట్స్ ఏమైనా నీకు దొరికాయా అనే దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే తమకి తెలిసిన వాళ్లందరికీ ఫోన్ లు చేసి కూడా సలార్ టికెట్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పటినుంచో తన లవ్ యాక్సెప్ట్ చెయ్యని తన గర్ల్ ఫ్రెండ్ కి కనుక ఒక అబ్బాయి సలార్ టికెట్ ఇస్తే ఇక ఆ అమ్మాయి అతని లవ్ ని ఒక చేసేంతలా సలార్ ఫీవర్ ఉంది.మరి ఇంత సంచలనం సృష్టిస్తున్న సలార్ కి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని సెంట్రస్ లో అర్ధరాత్రి ఒంటి గంట షో వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూద్దాం.
1) నెక్సస్ మాల్ - కూకట్‌పల్లి 2) ఏఎంబీ సినిమాస్ - గచ్చిబౌలి 3) భ్రమరాంబ - కూకట్‌పల్లి 4) మల్లికార్జున - కూకట్‌పల్లి 5) అర్జున్ - కూకట్‌పల్లి 6) విశ్వనాథ్ - కూకట్‌పల్లి 7) సంధ్య 70ఎంఎం - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 8) సంధ్య 35ఎంఎం - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 9) రాజధాని డీలక్స్ - దిల్‌సుఖ్ నగర్ 10) శ్రీరాములు - మూసాపేట 11) గోకుల్ - ఎర్రగడ్డ 12) శ్రీ సాయిరాం - మల్కాజిగిరి 13) ఎస్వీసీ తిరుమల - ఖమ్మం 14) వినోద్ - ఖమ్మం 15) వెంకటేశ్వర - కరీంనగర్ 16) నటరాజ్ - నల్గొండ 17) ఎస్వీసీ విజయ - నిజామాబాద్ 18) వెంకటేశ్వర - మహబూబ్ నగర్ 19) శ్రీనివాసా - మహబూబ్ నగర్ 20) రాధిక - వరంగల్. ఇలా తెలంగాణలో మొత్తం 20 థియేటర్స్ లో సలార్ మిడ్ నైట్ షోస్ పడనున్నాయి. ఇవే కాకుండా మరిన్ని థియేటర్స్ లో సలార్ విడుదల అయ్యి ఉంటే బాగుండేదని ప్రభాస్ ఫాన్స్ అనుకుంటున్నారు.
![]() |
![]() |