![]() |
![]() |

సౌత్ లో హిందీ సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతాయి. ముఖ్యంగా హిందీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. కానీ సౌత్ సినిమాలు, అందునా తెలుగు సినిమాలంటే నార్త్ వాళ్ళకి ఎప్పుడూ చిన్నచూపే. కావాలని తెలుగు సినిమాలను ఇబ్బంది పెట్టాలని చూస్తారు.
డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ నటించిన 'డంకీ', డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన 'సలార్' విడుదలవుతున్నాయి. అయితే సౌత్ లో 'డంకీ'కి కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతుంటే, నార్త్ లో మాత్రం 'సలార్'కి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లు అనే తేడా లేకుండా అన్ని చోట్లా సలార్ కి అన్యాయం జరుగుతుంది. దీనిలో మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్, ఐనాక్స్ ప్రముఖంగా భాగమయ్యాయి.
ఇప్పటికే 'డంకీ' అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఓపెన్ అయినా ఆశించినస్థాయిలో రెస్పాన్స్ లేదు. సలార్ మాత్రం ఓపెన్ అయిన ప్రతి చోటా సంచలన బుకింగ్స్ తో దూసుకుపోతోంది. అయినప్పటికీ సలార్ కి తగినన్ని స్క్రీన్స్ ఇవ్వకపోవడంపై అభిమానులతో పాటు మేకర్స్ కూడా తీవ్ర అసహనంలో ఉన్నారు.
నార్త్ లో తమ సినిమాకి తగినన్ని స్క్రీన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న పీవీఆర్, ఐనాక్స్ సంస్థలకు సలార్ నిర్మాతలు గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నార్త్ లో చేస్తున్న అన్యాయానికి కౌంటర్ గా.. సౌత్ లో పీవీఆర్, ఐనాక్స్ కి చెందిన స్క్రీన్లలో సలార్ ని విడుదల చేయకూడదని మేకర్స్ నిర్ణయించారు. సలార్ నిర్మాతలు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి షాక్ లు ఇస్తే కానీ వాళ్ళు దిగిరారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సలార్ నిర్మాతలకు మద్దతుగా ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానుల కూడా కలిసి #BoycottPVRInox హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్ లలో టికెట్స్ బుక్ చేసుకున్న వారిలో కొందరు వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు.
![]() |
![]() |