![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సినిమాలలో హను మాన్ కూడా ఒకటి. జాంబీ రెడ్డి విజయం తర్వాత తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి...
జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న హను మాన్ లో చిరంజీవి హనుమంతుడుగా కనిపిస్తున్నాడనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది.ఇటీవలే విడుదల అయిన హనుమాన్ ట్రైలర్ ఎండింగ్ లో ఆంజనేయ స్వామి ఎంట్రీ షాట్ ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా హనుమంతుడు కళ్ళు తెరిచే సన్నివేశం అయితే ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పాటు పుట్టించేలా చేసింది. ఇప్పుడు ఇది చూసిన చాలా మంది మెగా ఫ్యాన్స్ ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్ర చేస్తుంది మెగాస్టార్ చిరంజీవే అని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఎంతో అభిమానం. ఆయన తన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కొంచంసేపు హనుమంతుడిగా కనిపించాడు. అలాగే హనుమాన్ అనే బాలల యానిమేషన్ సినిమాకి కూడా హనుమంతుడి మీద ఉన్న ఇష్టంతో వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చాడు

ఈ సినిమా క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు హనుమంతుడు దర్శనం ఉంటుందని ఆ పాత్ర మెగా స్టార్ చేసాడని ఫాన్స్ అయితే గట్టిగానే నమ్ముతున్నారు.ప్రస్తుతానికి అయితే హనుమంతుడిగా ఎవరు చేశారనే విషయాన్ని మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ సస్పెన్సు గా ఉంచాడు. రేపు సినిమా విదుదల అయ్యాక గాని అసలు నిజం తెలియదు. గతంలో కూడా హనుమాన్ సినిమాలో ఆంజనేయుడు క్యారక్టర్ లో చిరంజీవి నటించబోతున్నాడనే వార్తలు వచ్చాయి.
![]() |
![]() |