![]() |
![]() |
.jpg)
కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితి కారణంగా ఆలస్యం అయిన హిందీ బిగ్ బాస్ 14 ఎట్టకేలకు ప్రారంభమైంది. ఏదేమైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆకలిని ఈ షో తీరుస్తుందని నిర్వాహకులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలు విడుదలయ్యాయి. వాటిలో కొంతమంది కంటెస్టెంట్ల ఐడెంటిటీ వెల్లడైంది. బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ల లిస్టులో కన్ఫామ్ అయిన వాళ్లలో నిక్కీ తంబోలి ఉంది.
.jpg)
1996 ఆగస్ట్ 21న పుట్టిన నిక్కీ మహారాష్ట్రలోని తన స్వస్థలం ఔరంగాబాద్‌లోనే స్కూలు, కాలేజీ రోజులు గడిపింది. సినీ రంగంలోకి రావాలని అప్పట్నుంచే ఆమె కలలు కంది. చదువు పూర్తయ్యాక మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, కొన్ని టీవీ కమర్షియల్స్‌లో నటించింది.
ఆ టైమ్‌లోనే టాలీవుడ్‌లో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. అది అడల్ట్ కామెడీగా వచ్చిన 'చీకటి గదిలో చిలక్కొట్టుడు'. అందులో అదిత్ అరుణ్‌తో కలిసి నటించింది. ఆమె అందాల ఆరబోతకు ప్రేక్షకులు పెదాల తడుపుకున్నారనేది నిజం. బోల్డ్ సీన్లలోనూ పచ్చిగా నటించేసింది నిక్కీ. ఆ తర్వాత శ్రీవిష్ణు సరసన 'తిప్పరా మీసం'లో హీరోయిన్‌గా పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌లో దర్శనమిచ్చింది. రాఘవ లారెన్స్ సినిమా 'కాంచన 3'లోనూ నటించింది నిక్కీ.
.jpg)
బిగ్ బాస్ 14 ప్రోమోలో 'దిల్‌బర్ దిల్‌బర్' సాంగ్‌కు డాన్స్ చేస్తూ ఆమె కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిక్కీ రెగ్యులర్‌గా తన పిక్చర్లను షేర్ చేస్తుంటుంది. ముంబైకి చెందిన డీజే రోహిత్ గిడాతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
.jpg)
![]() |
![]() |