![]() |
![]() |

ఎవరితో నటిస్తున్నాం అన్నదాని కంటే.. ఎలాంటి సినిమాలో, పాత్రలో నటిస్తున్నాం అన్నదానికే ప్రాధాన్యమిస్తుంటారు డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి. అందుకే.. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినా అపరిమిత అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారీ నేచురల్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సాయిపల్లవి. ఇందులో.. ఓ సపోర్టింగ్ యాక్టర్ హీరోగా నటిస్తుంటే.. అతని సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనున్నారట. ఆ యాక్టర్ ఎవరంటే.. కాళి వెంకట్. సాయిపల్లవి కథానాయికగా నటించిన మారి 2 (ఇందులో ధనుష్ హీరో)తో సహా పలు తమిళ చిత్రాల్లో కాళి వెంకట్ సహాయక పాత్రల్లో నటించాడు. కట్ చేస్తే.. తనే హీరోగా ఇప్పుడో కోలీవుడ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇందులోనే సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ, పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా దాదాపుగా ఓకే చెప్పిందని కోడంబాక్కం కబురు.
మరి.. సపోర్టింగ్ యాక్టర్ సరసన సాయిపల్లవి సై అంటూ చిందులేస్తున్నారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |