![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేయగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రేజ్‌తో విడుదలవుతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఐమాక్స్ రిమాస్టర్డ్ వెర్షన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు.
కాగా 'ఆర్ఆర్ఆర్'ను 3డి వెర్షన్‌తోనూ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా రాజమౌళి వెల్లడించారు. మంగళవారం ఏర్పాటుచేసిన ప్రింట్ అండ్ వెబ్ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడిన ఆయన 3డి సౌకర్యం అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ 'ఆర్ఆర్ఆర్' 3డి వెర్షన్ విడుదలవుతుందని చెప్పారు. ఇది నిజంగా 'ఆర్ఆర్ఆర్' అభిమానులకు సంబరం కలిగించే విషయమే.
'బాహుబలి'ని ఎలా విజువల్ ట్రీట్‌గా రాజమౌళి ప్రెజెంట్ చేశారో మనకు తెలుసు. అదే తరహాలో 'ఆర్ఆర్ఆర్'ను కూడా ఆయన ఒక విజువల్ ఎక్స్‌ట్రావాగంజాగా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తేనే తెలిసింది. అలాంటి మూవీని 3డిలో చూడ్డం నిజంగా ఒక మంచి అనుభవాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎం.ఎం. కీరవాణి స్వరాలు కూర్చగా ఇప్పటివరకూ విడుదలైన అన్ని పాటలూ సంగీత ప్రియులను అలరించాయి. నిన్న రిలీజ్ చేసిన 'ఎత్తర జెండా' పాట కూడా వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో తారక్, చరణ్, ఆలియా తమ డాన్స్ మూవ్స్‌తో అలరించారు.
![]() |
![]() |