![]() |
![]() |

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' వసూళ్లు సోమవారం భారీగా పడిపోయాయి. ఫస్ట్ వీకెండ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 48.29 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా సోమవారం కేవలం రూ. 2.11 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వెరసి.. నాలుగు రోజులకు 'రాధే శ్యామ్' వసూళ్లు రూ. 50.50 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి.
ఏ సినిమాకైనా సోమవారం అగ్నిపరీక్ష లాంటిది. ఆ రోజు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడితే, ఆ సినిమా సక్సెస్ దిశగా కొనసాగుతున్నట్లు లెక్క. అలాంటి పరీక్షలో 'రాధే శ్యామ్' విఫలమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేయగా.. గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రి బిజినెస్ వాల్యూ రూ. 105. 20 కోట్లని అంచనా.
ఇవాళ్టి రోజుల్లో ఫస్ట్ వీకెండ్‌లోనే 70 శాతం దాకా వసూలు చేయకపోతే, ఆ తర్వాత ఆ సినిమా రికవర్ అవడం కష్టమనేది విశ్లేషకుల మాట. ఆ ప్రకారం చూస్తే 'రాధే శ్యామ్' ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగలిగింది 48 శాతమే. ఇంకా 52 శాతం రికవర్ కావాలి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అది దాదాపు అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. యాక్షన్ స్టార్‌గా దేశవ్యాప్తంగా ఇమేజ్ వున్న ప్రభాస్‌తో లవ్ స్టోరీ తీయడమే ఈ సినిమాకు మైనస్ అయ్యిందనేది విమర్శకుల మాట.
![]() |
![]() |