![]() |
![]() |
.webp)
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా దాడులతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ తో భారత సినీ పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' కూడా అక్కడ షూటింగ్ జరుపుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఉక్రెయిన్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాదు, అక్కడ తమతో కలిసి పనిచేసిన ఉక్రెయిన్ వారికి ఆర్థికంగా సాయం చేసినట్లు రామ్ చరణ్ తెలిపాడు.
తాము ఉక్రెయిన్ వెళ్లినప్పుడు అంతా కూల్ గా ఉందని, ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని రాజమౌళి అన్నాడు. ఉక్రెయిన్ లో షూటింగ్ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ అని, అక్కడ తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపాడు. అక్కడ మాకు కొందరితో అనుబంధం ఏర్పడిందని.. ఇప్పుడు అక్కడ ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా ఫోన్స్ ద్వారా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటున్నామని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఉక్రెయిన్ వారు ఫ్రెండ్లీగా, ప్రొఫెషనల్ గా ఉన్నారని తారక్ అన్నాడు. మనకి తగ్గట్లు డ్యాన్స్ సూపర్ గా పర్ఫామ్ చేశారని చెప్పాడు. ఫుడ్, కల్చర్ ఆకట్టుకున్నాయని తారక్ తెలిపాడు. ఉక్రెయిన్ లో లాంగ్ షెడ్యుల్ జరిగిందని, షూట్ చాలా కంఫర్ట్ గా జరిగిందని, వారు స్వీట్ పీపుల్ అని చరణ్ అన్నాడు. ప్రజెంట్ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొందని, అక్కడ మాతో వర్క్ చేసిన స్టాఫ్ తో టచ్ లో ఉన్నామని చెప్పాడు. సెక్యూరిటీ టీమ్ లోని పర్సన్ తో మాట్లాడామని, అతని 85 ఏళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ దేశం కోసం గన్ పట్టుకున్నారని, ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలని అడిగితే కొంత డబ్బు కూడా పంపించామని చరణ్ తెలిపాడు.
![]() |
![]() |