![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి మొదలైంది. హీరోలు ఒక్కొక్కరుగా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టారు. షూటింగులు చేయడం ప్రారంభించారు. 'రాధే శ్యామ్' చిత్రీకరణకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వెళ్లారు. హైదరాబాద్ లో 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ మొదలైంది. నాగచైతన్య, సాయి తేజ్, నితిన్ తదితర యువ హీరోలు మేకప్ వేసుకున్నవారే. నేచురల్ స్టార్ నాని కూడా ఈ లిస్టులో చేరాడు. ఆయన కూడా షూటింగ్ స్టార్ట్ చేశారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'టక్ జగదీష్'. హైదరాబాద్ లో సోమవారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కరోనా కనుక ప్రతి సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నాని సినిమా యూనిట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా నాని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ లోపు సినిమా కంప్లీట్ అవుతుందని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
![]() |
![]() |