![]() |
![]() |

`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ.. త్వరలో `ఖిలాడి`గా పలకరించబోతున్నారు. ఇందులో తన ద్విపాత్రాభినయం.. అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి`ని 2022 ఫిబ్రవరి 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రవితేజ సోలో హీరోగా టర్న్ అయ్యాక ఫిబ్రవరి నెలలో రిలీజైన చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. `షాక్` (2006), `నిప్పు` (2012), `టచ్ చేసి చూడు` (2018).. ఇలా రవితేజ కథానాయకుడిగా నటించగా ఫిబ్రవరి మాసంలో థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. `ఖిలాడి` అయినా రవితేజ ఫిబ్రవరి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బాక్సాఫీస్ ముంగిట మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
కాగా, `ఖిలాడి`లో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నాయికలుగా నటించగా అర్జున్, ఉన్ని ముకుందన్, వెన్నెల కిశోర్, అనసూయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు.
![]() |
![]() |