![]() |

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ జోరు మాములుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా ప్రస్తుతం పలువురు అగ్ర కథానాయకుల కాంబినేషన్స్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారీ స్టార్ కంపోజర్.
ఇదిలా ఉంటే.. 2021 డిసెంబర్ డీఎస్పీకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. రెండు వరుస శుక్రవారాల్లో తన కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు దేవి శ్రీ ప్రసాద్. ఆ వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 10న తన స్వరకల్పనలో రూపొందిన `గుడ్ లక్ సఖి` థియేటర్స్ లో సందడి చేయనుండగా.. డిసెంబర్ 17న తను బాణీలు కట్టిన పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్` రిలీజ్ కానుంది. మరి.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రాబోతున్న ఈ సినిమాలతో దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా, `గుడ్ లక్ సఖి`లో కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించగా.. `పుష్ప - ద రైజ్`లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రచార చిత్రాలతో, పాటలతో ఈ రెండు సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
![]() |