![]() |
![]() |

(నవంబర్ 18 లేడీ సూపర్ స్టార్ నయనతార 37వ పుట్టినరోజు సందర్భంగా..)
దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో కేరళకుట్టి నయనతార ఒకరు. తమిళ, తెలుగు భాషల్లో దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ జోడీకట్టి కనువిందు చేశారు ఈ మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్.
ఇదిలా ఉంటే.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ.. ఇలా దక్షిణాదికి చెందిన నాలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సక్సెస్ ఫుల్ డెబ్యూ ఇచ్చిన కథానాయికలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో ఒకరిగా నయనతారకి ప్రత్యేక స్థానం ఉంది. తన మాతృభాష మలయాళంలో నయన్ నటించిన మొదటి సినిమా `మనస్సినక్కరే` (2003) కేరళలో పలు చోట్ల శతదినోత్సవాలు జరుపుకుంది. అలాగే, తమిళంలో తొలిసారిగా కనిపించిన `అయ్యా` (2005) కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. ఇక తెలుగులో ఫస్ట్ టైమ్ నేరుగా యాక్ట్ చేసిన `లక్ష్మీ` (2006) అయితే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. కన్నడంలో నయన్ అభినయించిన ప్రథమ చిత్రం `సూపర్` (2010) కూడా మంచి విజయం సాధించింది. మొత్తంగా.. అన్ని దక్షిణాది భాషల్లో నయన్ సక్సెస్ ఫుల్ డెబ్యూస్ ఇచ్చిందన్నమాట.
ఈ నేపథ్యంలో.. సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కాంబినేషన్ లో నయన్ చేస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ (`లయన్`) కూడా ఇదే బాటలో పయనించి ఆమె ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేరుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |