![]() |
![]() |

కన్నడ భామ రష్మిక మందన్న పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. తన స్నేహపూర్వక ప్రవర్తనతో, నవ్వుమోముతో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. చాలా సందర్భాల్లో, తన నవ్వుతోటే ఆమె అందర్నీ తన అభిమానుల్ని చేసుకుంటోందనేది నిజం. అల్లు అర్జున్ సరసన 'పుష్ప' మూవీతో త్వరలో ఆడియెన్స్ ముందుకు రానున్న ఆమె, బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో చేస్తున్న 'మిషన్ మజ్ను' మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. బుధవారం రాత్రి ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన ఆమె, ఎప్పట్లాగే మనోహరంగా కనిపించింది. అప్పుడామెను చూసిన వాళ్లెవరూ తమ చూపుల్ని పక్కకు తిప్పుకోలేరు.
ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కనిపించడం ఆలస్యం కెమెరాలు తమ పని తాము చేసుకుపోయాయి. ఆమె స్ట్రాప్‌లెస్, ప్రింటెడ్, ఆరెంజ్ మ్యాక్సీ డ్రెస్‌తో అదరగొడుతోంది. ఆ సింపుల్ డ్రస్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసింది. తలకు బ్లాక్ క్యాప్, ముఖానికి మాస్క్‌తో కనిపించింది రష్మిక. చేతిలో డెనిమ్ జాకెట్ పట్టుకొని ఉంది. చెవి రింగులు, అందమైన నెక్లెస్ ఆమె రూపానికి సంపూర్ణత్వం తెచ్చాయి.
వర్క్ విషయానికి వస్తే 'పుష్ప'తో పాటు శర్వానంద్ జోడీగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో నటిస్తోన్న రష్మిక, బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను', అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' సినిమాలు చేస్తోంది.
![]() |
![]() |