![]() |
![]() |

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తెలియజేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో ఆయన, "టెస్ట్‌లో నాకు కొవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలేమీ లేవు. స్వీయ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే దాన్నుంచి కోలుకొని, మరింత బలంగా వస్తానని ఆశిస్తున్నా." అని అందులో పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా తనకు సన్నిహితంగా గడిపిన వాళ్లందరూ పరీక్షలు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. తన రికవరీ గురించి త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తానని చెప్పారు చరణ్.
ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నారు. దాంతో పాటు తండ్రి చిరంజీవి టైటిల్ రోల్ చేస్తోన్న 'ఆచార్య' షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది.
.jpg)
![]() |
![]() |