![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ పాన్ - ఇండియా వెంచర్ జూలైలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. `#RC 15` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో 30 నిమిషాల ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రని నాలుగు ప్రధాన భాషల్లో నలుగురు వేర్వేరు స్టార్ హీరోల చేత వేయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగు వెర్షన్ లో మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆ క్యారెక్టర్ చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక హిందీ వెర్షన్ కోసం కండల వీరుడు సల్మాన్ ఖాన్ దాదాపు ఫిక్స్ అంటున్నారు. అలాగే తమిళ వెర్షన్ కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంపికైనట్లు వినికిడి. కన్నడ వెర్షన్ కోసం ఉపేంద్ర లేదా సుదీప్ నటించే ఛాన్స్ ఉందట. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, 2022 ద్వితీయార్ధంలో చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |