![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన ఊరమాస్ మూవీ `సరైనోడు`. మాస్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రంలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్ టైన్ చేశారు బన్నీ. పాటల్లో, పోరాటఘట్టాల్లో అభిమానులను అలరించి మరో విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, సాయికుమార్, సుమన్, జయప్రకాశ్, విజయ్ కుమార్, దేవదర్శిని, వినయ ప్రసాద్, అన్నపూర్ణ, విద్యుల్లేఖా రామన్, సురేఖా వాణి, రాజీవ్ కనకాల, జయప్రకాశ్ రెడ్డి, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు.. ఇలా భారీ తారాగణమే సందడి చేసింది. అంజలి ఓ ప్రత్యేక గీతంలో తన నృత్యాలతో కనువిందు చేశారు.
యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ``బ్లాక్ బస్టర్``, ``యూ ఆర్ మై ఎం.ఎల్.ఎ``, ``తెలుసా తెలుసా``, ``సరైనోడు``, ``అతిలోక సుందరి``, ``ప్రైవేట్ పార్టీ``.. ఇలా ఆల్బమ్ లోని ప్రతీ గీతం కుర్రకారుని ఫిదా చేసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించారు. 2016 ఏప్రిల్ 22న మిశ్రమ స్పందన నడుమ విడుదలైన `సరైనోడు`.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళ వర్షం కురిపించింది. నేటితో ఈ ఊరమాస్ ఎంటర్ టైనర్.. 5 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |