![]() |
![]() |

విలక్షణ పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న విజయ్ సేతుపతి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ విడుదలై. కమెడియన్ సూరి హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో అతని గురువుగా విజయ్ సేతుపతి నటిస్తుండటం విశేషం. జాతీయ అవార్డులు కొల్లగొట్టిన సినిమాల దర్శకుడిగా పేరుపొందిన వెట్రిమారన్ డైరెక్టర్ చేస్తోన్న ఈ మూవీని ఆర్.ఎస్. ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇళయరాజా, వెట్రిమారన్ కలసి పనిచేస్తోన్న తొలి చిత్రం విడుదలై.
కరెంట్, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉండని పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో.. విజయ్ సేతుపతి, వెట్రిమారన్, సూరి, భవాని శ్రీ సహా ఎంటైర్ యూనిట్ అక్కడి గిరిజన ప్రజలతో ఉంటూ ‘విడుదలై’ సినిమాని షూట్ చేశారు.
‘అసురన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత అంతే స్ట్రాంగ్ కంటెంట్‌తో డైరెక్టర్ వెట్రిమారన్ ‘విడుదలై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆకట్టుకునే ట్విస్టులు, టర్న్‌లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వెట్రిమారన్ సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించే సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్ ఈ సినిమాకీ ఆ బాధ్యతను తీసుకున్నాడు. పీటర్ హెయిన్ యాక్షన్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు.

![]() |
![]() |