![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన సినిమా `మిస్టర్ పర్ ఫెక్ట్`. `డార్లింగ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తో ప్రభాస్ జోడీకట్టిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో తాప్సీ మరో హీరోయిన్ గా నటించింది. కె.విశ్వనాథ్, మురళీ మోహన్, నాజర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, మాస్టర్ భరత్, సాగర్, సమీర్, సుదీప తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కుటుంబకథా చిత్రాల స్పెషలిస్ట్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మించారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``చలిచలిగా``, ``ఆకాశం బద్ధలైనా``, ``రావుగారి అబ్బాయి``, ``బదులు తోచని``, ``అగ్గిపుల్లలాంటి`` వంటి గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 2011కిగానూ `బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్`గా `నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు`ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. అడపాదడపా బుల్లితెరపై అలరిస్తూనే ఉంది. 2011 ఏప్రిల్ 22న విడుదలై మంచి విజయం సాధించిన `మిస్టర్ పర్ ఫెక్ట్`.. నేటితో పదేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |