![]() |
![]() |

2021 ఆరంభంలో `మాస్టర్`, `ఉప్పెన` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు `మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతి. ఈ రెండు సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో.. విజయ్ సేతుపతి తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా విజయ్ సేతుపతి నుంచి రానున్న నెక్స్ట్ మూవీ థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆ చిత్రమే.. `తుగ్లక్ దర్బార్`. విజయ్ సేతుపతికి జంటగా రాశీ ఖన్నా నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో పార్తీబన్, మంజిమా మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. డెబ్యూ డైరెక్టర్ డిల్లీ ప్రసాద్ దీనదయాళన్ రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `96` ఫేమ్ గోవింద్ వసంత బాణీలు అందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక `డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో స్ట్రీమ్ కానుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందంటున్నారు.
మరి.. తెలుగులోనూ `తుగ్లక్ దర్బార్` అనువాద రూపంలో అందుబాటులోకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |