![]() |
![]() |

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతూ పెరిగారు. సినిమాల్లోకి రాకముందు కూలీగా, కార్పెంటర్‌గా, బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేశారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. ఆ సందర్భంలోనే తమిళం నేర్చుకున్నారు.
తనకంటే వయసులో ఎనిమిదేళ్లు చిన్నదైన లతా రంగాచారిని రజనీ పెళ్లాడారు. కాలేజీ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన కాలేజీ స్టూడెంట్ లతను చూసీ చూడగానే ఆయన హృదయం లయ తప్పింది. ఇంటర్వ్యూ అయిన వెంటనే ప్రపోజ్ చేశారు. ఆ ఇద్దరికీ ఇద్దరు కుమార్తెలు.. ఐశ్వర్య, సౌందర్య.
'శివాజీ' సినిమాతో ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు రజనీ. అప్పుడు తొలి స్థానం జాకీ చాన్‌ది. 2007లో శివాజీకి రజనీ అందుకున్న పారితోషికం రూ. 26 కోట్లు.
రజనీ ఎప్పడు తన సినిమాలను పబ్లిక్‌గా చూడలేదు. ఒక సినిమా చేశాక, చెన్నై నుంచి హిమాలయాలకో, మరో ప్రశాంత ప్రదేశానికో వెళ్లడం ఆయనకు అలవాటు.
2010లో ఐఎండీబీ టాప్ 50 ఫిలిమ్స్‌లో చోటు సంపాదించుకున్న ఏకైక తమిళ చిత్రం రజనీ నటించిన 'ఎందిరన్' (రోబో).
షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తరహాలోనే రజనీ ఫ్యాన్స్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉండటం విశేషం.
గతంలో తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని తిరిగివెళ్తూ, ముగ్గురు అభిమానులు యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలైన దగ్గర్నుంచీ చెన్నైలో తన పుట్టినరోజు వేడుకను చేసుకోవడం మానేశారు రజనీ.
![]() |
![]() |