Home  »  News  »  ర‌జ‌నీకి మోడీ, చిరు బ‌ర్త్‌డే విషెస్‌!

Updated : Dec 12, 2020

 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శ‌నివారం 70వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆయ‌న‌కు బెస్ట్ విషెస్ తెలియ‌జేశారు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా, ర‌జ‌నీ చిర‌కాలం ఆరోగ్యంతో జీవించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. చిరంజీవి, మ‌హేశ్‌బాబు, వెంక‌టేశ్‌, మోహ‌న్ లాల్‌, ఎ.ఆర్‌. రెహ‌మాన్‌, న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, ర‌ష్మికా మంద‌న్న‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, శ‌త్రుఘ్న సిన్హా, సునీల్ శెట్టి, హ‌న్సిక త‌దిత‌ర అనేక‌మంది తార‌లు త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ర‌జ‌నీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Dear @rajinikanth  Ji, wishing you a Happy Birthday! May you lead a long and healthy life. అని ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ. 

చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ర‌జ‌నీ, తాను ఆప్యాయంగా చేతులు క‌లుపుతున్న పిక్చ‌ర్‌ను షేర్ చేసి, Dearest Friend @rajinikanth Happy 70th Birthday & Wish you a wonderful life ahead. Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I trust U will also tread Ur unique path in serving those millions! Stay Blessed!Lots of love! అని రాసుకొచ్చారు. 

మ‌హేశ్‌బాబు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా, Happy birthday, @rajinikanth sir! May you continue to inspire millions and redefine style in cinema. Wishing you good health, happiness and peace always! అని ట్వీట్ చేశారు.

ర‌జ‌నీకాంత్ చివ‌రిసారిగా ఎ.ఆర్‌. మురుగ‌దాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ద‌ర్బార్‌'లో క‌నిపించారు. పొంగ‌ల్‌కు 'అన్నాత్తే' మూవీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్‌, న‌య‌న‌తార‌, ప్ర‌కాశ్ రాజ్‌, జాకీ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు.

చాలా కాలం స్పెక్యులేష‌న్ అనంత‌రం తాను రాజ‌కీయ పార్టీని లాంచ్ చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల ర‌జ‌నీ ప్ర‌క‌టించారు. 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.