![]() |
![]() |

సుప్రీమ్ హీరో సాయితేజ్ తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమా తరువాత దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు తేజ్. అంతేకాదు.. ఈ సినిమాతో పాటు సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు డెబ్యూ డైరెక్టోరియల్ ని కూడా పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట ఈ చిత్రలహరి స్టార్.
కాగా, ఈ చిత్రంలో సాయితేజ్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించే అవకాశముందంటున్నారు. ఇప్పటికే కీర్తితో ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని.. కథ, పాత్ర నచ్చడంతో తను కూడా ఓకే చెప్పిందని వినికిడి. త్వరలోనే సాయితేజ్ - కార్తిక్ దండు కాంబినేషన్ మూవీలో కీర్తి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో గుడ్ లక్ సఖి, రంగ్ దే వంటి మీడియం బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. ఈ రెండు కూడా చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిగా నటిస్తున్న అణ్ణాత్తే, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట కూడా కీర్తి ఖాతాలో ఉన్నాయి.
![]() |
![]() |