![]() |
![]() |

తమిళ అనువాద చిత్రం పిశాచితో తెలుగువారికి పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్. రీసెంట్ గా నటసింహ నందమూరి బాలకృష్ణ - అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ (బీబీ3)లో అవకాశం అందినట్టే మిస్సయింది ఈ అమ్మడికి. కట్ చేస్తే.. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తాలూకు హ్యాట్రిక్ వెంచర్ లో ఛాన్స్ పట్టేసిందట ప్రయాగ.
ఆ వివరాల్లోకి వెళితే.. కాక్క కాక్క, వానరమ్ ఆయిరమ్ (సూర్య సన్నాఫ్ కృష్ణన్) తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాక్మంగా నిర్మిస్తున్న నవరస ఆంథాలజీ కోసం ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కలసి పనిచేస్తున్నారు. కాగా, ఇందులో సూర్యకి జోడీగా ప్రయాగ ఎంపికైందట. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో.. ప్రయాగ వెంటనే ఓకే చెప్పేసిందట.
మరి.. బాలయ్యతో మిస్ అయి.. సూర్య తో యస్ అనిపించుకున్న ప్రయాగకి నవరసతో ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి. 2021 వేసవిలో ఈ ఆంథాలజీ స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |