![]() |
![]() |
.jpg)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీస్ లో సలార్ ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ యాక్షన్ సాగా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ బడ్జెట్ మూవీగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దిశా పటాని నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దిశ ఒక్కతే కాదు.. మరో ఇద్దరు ఉత్తరాది భామలు కూడా ఇందులో ప్రభాస్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారట. ఆ ఇద్దరు మరెవరో కాదు.. శ్రద్ధా కపూర్, కియారా అద్వాని. వీరిలో శ్రద్ధా కపూర్ ఇప్పటికే ప్రభాస్ కాంబినేషన్ లో సాహో చేసింది. దిశ, కియారా మాత్రం తొలిసారి ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరోతో ఆడిపాడనున్నారు.
త్వరలోనే సలార్ లో శ్రద్ధ, కియారా, దిశ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 2022 ఆరంభంలో సలార్ తెరపైకి రానుంది.
![]() |
![]() |