![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. 'సింహ', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ టీమ్ తాజాగా ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
బాలకృష్ణ- బోయపాటి ల హ్యాట్రిక్ మూవీ 'అఖండ' షూటింగ్ పూర్తయ్యిందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే థియేటర్స్ లో సినిమా విడుదల కానుందని పేర్కొంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సాంగ్ చిత్రీకరణతో 'అఖండ' షూటింగ్ పూర్తయ్యిందని తెలిపారు. బాలకృష్ణ- బోయపాటి ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ 'అఖండ'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి 'అఖండ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |