![]() |
![]() |

అక్టోబర్‌లో రాజమౌళి భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను పునరుద్ధరించారు. మహమ్మారి కారణంగా విధించిన దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో నెలల తరబడి బ్రేక్ తీసుకున్నాక యూనిట్ అంతా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ కచ్చితమైన సురక్షిత విధానాలను పాటిస్తున్నారు. వారిలో టీమ్ స్పిరిట్ నింపడానికి రాజమౌళి అందరితోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటించారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన తెర వెనుక సీన్ల ఫుటేజ్‌ను నిర్మాతలు షేర్ చేశారు. అందులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న దృశ్యం కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో రాత్రివేళ చిత్రీకరించే యాక్షన్ సీక్వెన్స్ ఉంది. తన టీమ్‌కు ఈ సీన్ గురించి రాజమౌళి వివరిస్తుండటం ఈ ఫుటేజ్‌లో మనకు కనిపిస్తుంది. పలువురు జూనియర్ ఆర్టిస్టులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌కుమార్ అసిస్టెంట్ వేద ఒక అప్డేట్ను పంచుకున్నారు. ఒక ఎపిక్ ఫైట్ సీన్‌ను తీస్తున్నట్లు అతను వెల్లడించాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ వీడియోను రికార్డ్ చేశారు. థియేటర్లలో చూసేటప్పుడు సినిమా వేరే లెవల్లో ఉంటుందని వేద పేర్కొన్నాడు.
![]() |
![]() |