![]() |
![]() |

పవన్ కళ్యాణ్ కి అచ్చొచ్చిన నాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. 'గబ్బర్ సింగ్' కోసం తొలిసారి జట్టుకట్టిన పవన్, శ్రుతి.. ఆ సినిమాతో మెమరబుల్ హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'కాటమరాయుడు' వచ్చింది. అయితే గబ్బర్ సింగ్ లా ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ ఇద్దరూ... 'వకీల్ సాబ్' కోసం ముచ్చటగా మూడోసారి పెయిర్ అప్ అయ్యారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్, శ్రుతి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన రెండు సినిమాలూ.. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చిత్రం.. ఈ మూడు కూడా రీమేక్ మూవీస్ నే. హిందీ బ్లాక్ బస్టర్ 'దబాంగ్' (2010) ఆధారంగా 'గబ్బర్ సింగ్' తెరకెక్కితే.. తమిళ సినిమా 'వీరమ్' (2014) ఆధారంగా 'కాటమరాయుడు' రూపొందింది. ఇక 'వకీల్ సాబ్' విషయానికి వస్తే.. హిందీ ఫిల్మ్ 'పింక్' (2016), దాని ఆధారంగా కొన్ని మార్పు చేర్పులతో తెరకెక్కిన తమిళ్ ఫ్లిక్ 'నేర్కొడ పార్ వై' (2019) ఆధారంగా పిక్చరైజ్ అవుతోంది.
మరి.. హిందీ రీమేక్ తో ఘనవిజయాన్ని, తమిళ రీమేక్ తో పరాజయాన్ని చవిచూసిన పవన్, శ్రుతి జోడీ.. ఈ సారి ఆ రెండు భాషలకు చెందిన రీమేక్ తో ఎలాంటి ఫలితాన్ని మూటగట్టుకుంటుందో చూడాలి.
![]() |
![]() |